జగన్‌ డైరెక్షన్‌లో ఏసీబీ: యనమల 

తాజా వార్తలు

Updated : 12/06/2020 10:24 IST

జగన్‌ డైరెక్షన్‌లో ఏసీబీ: యనమల 

అమరావతి: టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడి వ్యవహారంలో ఏసీబీ అధికారులు తీరును శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఖండించారు. బీసీ నాయకుడి ఎదుగుదల చూసి ఓర్వలేక  జగన్‌ మోహన్‌రెడ్డి కక్షగట్టి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి తప్పు చేయకపోయినా..కుట్రపూరితంగా అభియోగం మోపారని ఆరోపించారు. ఏసీబీ కొత్తగా చేసేదేమీ లేదని, పూర్తిగా జగన్‌ డైరెక్షన్‌లోనే పనిచేస్తోందన్నారు. జగన్‌ ఏది చెబితే ఏసీబీ అదే చేస్తుందని విమర్శించారు. అచ్చెన్నాయుడి కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. మంత్రిగా పనిచేసిన నాయకుడిని అరెస్టు చేసినప్పుడు కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటి వరకు అరెస్టు చూపించలేదని, కిడ్నాప్‌ చేసినట్లుగానే తాము భావిస్తున్నామని యనమల తెలిపారు.

అచ్చెన్నాయుడిని కిడ్నాప్‌ చేశారు: చంద్రబాబు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని