అచ్చెన్న అరెస్టు సందేహాలకు తావిస్తోంది:జనసేన

తాజా వార్తలు

Updated : 12/06/2020 14:21 IST

అచ్చెన్న అరెస్టు సందేహాలకు తావిస్తోంది:జనసేన

అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేయడం పలు సందేహాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేక రాజకీయ కక్ష సాధింపా? అనే విషయంలో వైకాపా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఒక శాసనసభ్యుడిని అరెస్టు చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. అచ్చెన్న అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తోందన్నారు. ఈఎస్‌ఐలో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని తమ పార్టీ డిమాండ్‌ చేస్తోందని నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని