ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది: పట్టాభి

తాజా వార్తలు

Published : 15/06/2020 00:33 IST

ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది: పట్టాభి

అమరావతి: సుప్రీంకోర్టులో ఎదురైన పరాభవాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిందని తెలుగుదేశం సీనియర్‌ నేత పట్టాభి మండిపడ్డారు. ఈనెల 10న ఎస్‌ఈసీ వ్యవహారంపై సుప్రీం తీర్పు రాగానే ... అచ్చెన్న అరెస్టుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. ‘10వ తేదీ రాత్రి 11 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఒక్కరోజులో విచారణ పూర్తి చేశారు. 12వ తేదీ ఉదయం అచ్చెన్నను అరెస్టు చేశారు. ఒక్కసారైనా ఆయన నుంచి వివరణ తీసుకున్నారా?ఇది రాజకీయ కుట్ర కాదా?’’ అని పట్టాభి ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన రిమాండ్‌ రిపోర్టులో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు జగన్‌ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని