‘కేంద్రం దృష్టితో కేసీఆర్‌ హడావుడి’

తాజా వార్తలు

Published : 16/06/2020 16:17 IST

‘కేంద్రం దృష్టితో కేసీఆర్‌ హడావుడి’

బండి సంజయ్‌

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షల విషయంలో తెరాస ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైరస్‌ వ్యాప్తి అరికట్టాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. కరోనా వైరస్‌ పరీక్షలపై కేంద్రం దృష్టి సారించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హడావుడి చర్యలు చేపట్టారని విమర్శించారు. మూడు నెలల్లో కేవలం 40వేల మందికి మాత్రమే పరీక్షలు చేశారని.. అలాంటిది ఇప్పుడు 50వేల మందికి పరీక్షలు నిర్వహిస్తామనటం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల వారీగా కాకుండా జిల్లాల వారీగా పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం పరీక్షలు చేశామని ప్రభుత్వం సాకులు చెబుతోందని మండిపడ్డారు. ఆర్భాటపు, హడావుడి చర్యలతో ప్రజలను మభ్య పెట్టకుండా చిత్తశుద్ధితో కరోనా కట్టడికి వ్యవహరించాలని ప్రభుత్వానికి బండి సంజయ్‌ సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని