ఆ బిల్లును మళ్లీ అడ్డుకుంటాం: యనమల

తాజా వార్తలు

Published : 17/06/2020 12:01 IST

ఆ బిల్లును మళ్లీ అడ్డుకుంటాం: యనమల

అమరావతి: సెలెక్ట్‌ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న సీఆర్డీయే చట్టం రద్దు, వికేంద్రీకరణ బిల్లులను ప్రభుత్వం మళ్లీ తీసుకురావటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎలాంటి సవరణలు లేకుండా మళ్లీ పాతబిల్లులు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

 ప్రభుత్వం మొదటి నుంచి రాజధాని మార్పుపై దురుద్ధేశంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజాభీష్టానికి ఇది పూర్తి వ్యతిరేకమన్నారు. రెండోసారి బిల్లులు పాస్‌ చేసి మళ్లీ మండలికి పంపడం సరికాదని హితవుపలికారు. సెలెక్ట్‌ కమిటీ వద్ద బిల్లు ఉందని ఏజీ కోర్టుకు చెప్పారని గుర్తు చేశారు. మండలిలో బిల్లును ఎలా అడ్డుకుంటామో వాళ్లే చూస్తారని యనమల వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని