మోదీజీ.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..!

తాజా వార్తలు

Updated : 17/06/2020 14:21 IST

మోదీజీ.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..!

ట్విటర్‌లో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

ముంబయి: తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో చైనా బలగాల దాడిలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై శివసేన తీవ్ర స్థాయిలో స్పందించింది. చైనా దూకుడుకు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేసింది. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ప్రధాని మోదీతోనే ఉంటారని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌, ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. సూర్యాపేటకు చెందిన తెలుగు తేజం కర్నల్‌ సంతోష్ ‌బాబుతో పాటు 20 మంది జవాన్లు వీరమరణం పొందిన ఘటనపై ఆయన ట్విటర్‌లో స్పందించారు.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ.. మీరు ఎంతో ధైర్యవంతులు. యోధులు. మీ నాయకత్వంలో చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. చైనా దూకుడుకు తగిన సమాధానం ఎప్పుడు చెబుతారు? ఒక్క బుల్లెట్‌ కూడా పేలకుండానే 20మంది మన సైనికులు అమరులయ్యారు. మనం ఏం చేశాం? ఎంతమంది చైనా సైనికులు చనిపోయారు? ప్రస్తుత పరిస్థితుల్లో దేశమంతా ప్రధానితోనే ఉంది. కానీ వాస్తవమేంటి? ఏదో ఒకటి మాట్లాడండి. నిజమేంటో దేశం తెలుసుకోవాలనుకుంటోంది. జై హింద్‌’’ అని రౌత్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి

35మంది చైనా సైనికుల మృతి: అమెరికా మీడియా

భారత్‌-చైనా ఘర్షణపై విదేశీ మీడియా ఏమందంటే..

నాన్న కోసం సైనికుడై.. దేశం కోసం అమరుడై..

మంచుకొండల్లో నెత్తుటేర్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని