చప్పట్లు కొట్టండని చేతులు దులుపుకొన్నారు..

తాజా వార్తలు

Published : 23/06/2020 01:12 IST

చప్పట్లు కొట్టండని చేతులు దులుపుకొన్నారు..

కరోనాపై రాజకీయాలా?: భాజపాకు ఈటల కౌంటర్‌

హైదరాబాద్‌: కరోనా నివారణకు, చికిత్సకు నిధులివ్వని కేంద్రం.. చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అంటూ చేతులు దులుపుకొంటోందని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. తెలంగాణ తెచ్చుకున్న టెస్టింగ్‌ మిషన్లను వేరే రాష్ట్రాలకు తరలిస్తోందని ఆక్షేపించారు. కరోనాపేరుతో భాజపా నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పట్ల తమకు ఉన్న నిబద్ధత ఇంకెవరికీ ఉండదన్నారు. తమ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. 

కరోనా నివారణలో తెరాస సర్కార్‌ విఫలమైందంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసి నవ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. అలాగే, కరోనా టెస్టింగ్‌ యంత్రాలను ఆర్డర్‌ చేసిన పత్రాలను విడుదల చేశారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం ముందుందన్న ఈటల.. పెద్ద ఎత్తున పరీక్షలు చేసేందుకు కరోనా టెస్టింగ్‌ మిషన్లకు ఆర్డర్‌ చేసిందన్నారు. కేంద్రం పశ్చిమబెంగాల్‌లో ఎమర్జెన్సీ అంటూ దానిని కోల్‌కతాకు తరలించిందన్నారు. ఖర్చులో వెనుకాడకుండా రాష్ట్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు.  రోజుకు 3500 నుంచి 4000 పరీక్షలు చేయగల సామర్థ్యం ఉన్న రోస్‌ కంపెనీకి చెందిన కోబోస్‌ 8800 మిషన్లను దేశంలో మొదటిసారి తెలంగాణనే ఆర్డర్‌ చేసిందని తెలిపారు. దేశానికి వచ్చిన మొదటి మిషన్‌ను కేంద్రం బెంగాల్‌కు పంపిందని విమర్శించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని