నియంతల నియంత్రణకు మండలి ఉండాల్సిందే..

తాజా వార్తలు

Published : 24/06/2020 11:31 IST

నియంతల నియంత్రణకు మండలి ఉండాల్సిందే..

తెదేపా నేత యనమల వ్యాఖ్య

అమరావతి: ప్రజాస్వామ్యంలో నియంతల నియంత్రణకు శాసన మండలి శాశ్వత సభగా ఉండాలని తెదేపా సీనియర్‌ నేత యనమల అన్నారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు ఎగువ సభలు కీలకమని తెలిపారు. ప్రజాస్వామ్య నియంతలా మారిన జగన్‌ లాంటి నేతల కట్టడికి మండలి ఉండాల్సిందేనన్నారు.

రాజ్యసభ శాస్వత సభగా ఉన్నప్పుడు మండలి కూడా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని యనమల కోరారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకే మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు బిల్లులను  శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపితే.. అందుకు రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధంగా లేదన్నారు. ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై కేంద్రం దృష్టిసారించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని