జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు?

తాజా వార్తలు

Published : 25/06/2020 02:44 IST

జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు?

ప్రభుత్వానికి తెదేపా నేత పట్టాభి ప్రశ్న

అమరావతి: 108 అంబులెన్స్‌ల స్కామ్‌పై వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించాలని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినవాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. జ్యుడీషియల్‌ రివ్యూ పేరు చెప్పి... వెయిటేజీ మార్కులు పెంచడంలో కుట్ర ఉందని పట్టాభి ఆరోపించారు. అనుభవం లేని అరబిందో ఫౌండేషన్‌కి ఏదో విధంగా 108 అంబులెన్స్‌ సర్వీసులను కట్టబెట్టడం కోసం... జ్యుడీషియల్‌ రివ్యూ పేరుతో వైకాపా ప్రభుత్వం క్లాజుల్లో మార్పులు చేసిందని పట్టాభి ఆరోపించారు. 

ఇన్ని కుట్రలా...

కరోనా సమయంలో సరిపడా అంబులెన్స్‌లు ఎందుకు పెట్టలేదని పట్టాభి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘కరోనా రోగులను తరలించే అంబులెన్స్‌లోనే ఇతర రోగులను తరలిస్తున్నారు. ఇతర రోగుల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు?  అరబిందో కంపెనీకి ప్రయోజనం చేకూర్చడానికి ఇన్ని కుట్రలా? ’’ అని పట్టాభి ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని