‘సొంత పరిశ్రమ కోసం నీటి చౌర్యం చేస్తారా?’

తాజా వార్తలు

Published : 29/06/2020 01:49 IST

‘సొంత పరిశ్రమ కోసం నీటి చౌర్యం చేస్తారా?’

సీఎం జగన్‌కు పట్టాభి ప్రశ్న

అమరావతి: సొంత వ్యాపార సంస్థ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జల చౌర్యానికి పాల్పడ్డారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. నిబంధనల ప్రకారం అనుమతించిన దానికంటే రెట్టింపు నీటిని సరస్వతి ఇండస్ట్రీస్‌కు మళ్లిస్తూ జారీ చేసిన జీవో అక్రమం అని పట్టాభి అన్నారు. అక్రమ జలకేటాయింపుల జీవోను తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సీఎం జగన్‌మోహన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. సరస్వతి ఇండస్ట్రీస్‌ కోసం సీఎం జగన్‌ అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. 

‘‘సరస్వతి ఇండస్ట్రీస్‌ సంవత్సరానికి 0.036 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించే అవకాశం ఉందని పర్యావరణ శాఖ స్పష్టం చెప్పింది. అయితే దానికి రెండింతల నీటిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఓ పక్క రైతులకు నీరందక పంటలు ఎండిపోతుంటే... ఇలా సొంత పరిశ్రమ కోసం నీటి చౌర్యం చేస్తారా?’’ అని పట్టాభి ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని