విదేశీకి జన్మించినవాడు దేశభక్తుడు కాలేడు!

తాజా వార్తలు

Published : 29/06/2020 13:23 IST

విదేశీకి జన్మించినవాడు దేశభక్తుడు కాలేడు!

భోపాల్‌: భాజపా ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ వనితకు జన్మించిన వ్యక్తి దేశభక్తుడు కాలేడని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ఆమె పరోక్షంగా విమర్శించారు.

రాహుల్‌ గాంధీ ఆయన తల్లి సోనియా గాంధీ దేశభక్తిని ప్రగ్యా ఠాకూర్‌ ప్రశ్నించారు. ‘ఈ గడ్డపై జన్మించినవాడే దేశాన్ని కాపాడతాడు. ఒక విదేశీ వనితకు పుట్టినవాడు దేశభక్తుడు కాలేడని చాణక్య చెప్పారు. ఒకవేళ మీకు రెండు దేశాల్లో పౌరసత్వం ఉంటే దేశభక్తి అనుభూతి ఎలా కలుగుతుంది’ అని ఆమె విమర్శించారు. ‘కాంగ్రెస్‌ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎలా మాట్లాడాలో వారికి తెలియదు. నీతి, నైతికత, దేశభక్తికి ఆ పార్టీ దూరం’ అని ఆమె అన్నారు.

గల్వాన్‌ లోయలో జరిగిన సైనిక ఘర్షణపై రాహుల్‌, సోనియా, మన్మోహన్‌ సింగ్‌ స్పందించిన సంగతి తెలిసిందే. ఆయుధాలు లేకుండా జవాన్లను పంపారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, చైనా మన ప్రాంతాన్ని ఆక్రమించిందా, దాచివుంచడం దౌత్యనీతి కాదంటూ ప్రధాని నరేంద్రమోదీ, భాజపాపై వారు విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులు కాంగ్రెస్‌పై ప్రతి విమర్శలు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని