వైకాపా ఎమ్మెల్సీలు @ 10

తాజా వార్తలు

Published : 29/06/2020 19:36 IST

వైకాపా ఎమ్మెల్సీలు @ 10

ఎమ్మెల్సీగా మాణిక్య వరప్రసాద్‌ ఏకగ్రీవం

అమరావతి: వైకాపా ఎమ్మెల్సీగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఏపీ శాసన మండలి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఎన్నికయ్యారు. రిటర్నింగ్‌ అధికారి నుంచి ఎమ్మెల్సీగా వరప్రసాద్‌ ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. దీంతో ఇప్పటివరకు మండలిలో 9గా ఉన్న వైకాపా సభ్యుల సంఖ్య 10కి చేరింది. డొక్కా రాజీనామాతో ఖాళీ అయిన స్థానం మళ్లీ ఆయనతోనే భర్తీ కావడం విశేషం.  నాలుగు రోజుల క్రితమే ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ స్థానానికి ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో మాణిక్యవరప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని