కరోనా: ప్రధాని మోదీకి రేవంత్‌ రెడ్డి లేఖ

తాజా వార్తలు

Published : 02/07/2020 01:20 IST

కరోనా: ప్రధాని మోదీకి రేవంత్‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌: కోవిడ్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాలను, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్‌ లేఖలో ప్రస్తావించారు.

‘‘రాష్ట్రంలో కొవిడ్ రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణలో పాజిటివ్ కేసులు శాతం దేశంలోనే అత్యధికంగా ఉంది. మహారాష్ట్రలో 22 శాతం ఉండగా, తెలంగాణలో 27 శాతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి అసంతృప్తిని వ్యక్తం చేసింది’’ అని రేవంత్‌ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని