‘నిధులు,విరాళాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి’

తాజా వార్తలు

Published : 02/07/2020 01:13 IST

‘నిధులు,విరాళాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి’

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

హైదరాబాద్‌: ‘‘కరోనా కట్టడికి కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదంటున్న తెరాస నేతలు... కేంద్రం ఇచ్చిన నిధులు, సీఎం సహాయనిధికి వచ్చిన విరాళాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల జన సంవాద్‌ వర్చువల్‌ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా విషయంలో కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ తెరాస నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అలాగే వరంగల్‌ జిల్లా కోసం గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి కూడా ప్రస్తావించారు. 

‘‘వరంగల్ స్మార్ట్ సిటీ కోసం కేంద్రం రూ. 200 కోట్లు కేటాయిస్తే పక్కదారి పట్టించారు. వరంగల్ జిల్లాకు రూ.300 కోట్లు కేటాయిస్తానని ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. టెక్స్ టైల్ పార్క్‌ను ప్రారంభించి నిధులను దారి మళ్లించారు’’ అని బండి సంజయ్‌ ఆరోపించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని