అచ్చెన్నాయుడు డిశ్చార్జిని ఖండించిన చంద్రబాబు

తాజా వార్తలు

Published : 02/07/2020 01:17 IST

అచ్చెన్నాయుడు డిశ్చార్జిని ఖండించిన చంద్రబాబు

అమరావతి: గుంటూరులోని జీజీహెచ్‌ నుంచి తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని డిశ్చార్జి చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడితో డిశ్చార్జి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. సాయంత్రం 5గంటల తర్వాత 4.20 గంటల సమయం వేసి డిశ్చార్జి చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. డిశ్చార్జి చేయడంలో కనీస నిబంధనలు సైతం పాటించకపోవడం గర్హనీయమన్నారు. కమిటీ పేరుతో ఒత్తిడి తెచ్చితప్పుడు నివేదిక ఇప్పించడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడటాన్ని ఖండించారు. ఆయన అరెస్టులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసిందన్న చంద్రబాబు.. మళ్లీ రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైందని మండిపడ్డారు. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రాకపోవడం గర్హనీయమన్నారు.
విజయవాడలోని జిల్లా జైలుకు అచ్చెన్నాయుడు

గుంటూరులోని జీజీహెచ్‌ నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడును విజయవాడలోని జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.ఈ నేపథ్యంలో జైలు వద్ద ఎంపీ రామ్మోహన్‌నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు.

 

ఇదీ చదవండి..

జీజీహెచ్‌ నుంచి అచ్చెన్నాయుడు డిశ్ఛార్జి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని