పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం పెట్టండి

తాజా వార్తలు

Updated : 04/07/2020 23:37 IST

పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం పెట్టండి

లోక్‌సభ స్పీకర్‌కు రఘురామకృష్ణరాజు లేఖ 

దిల్లీ: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో ప్రతిష్ఠించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు.  అల్లూరి 122వ జయంతి దృష్ట్యా ఆయన కాంస్య విగ్రహం ప్రతిష్టించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ గిరిజనులకు, తెలుగు ప్రజలకు అల్లూరి ఆరాధ్యుడని తెలిపారు. అల్లూరి విగ్రహం పార్లమెంటులో ఏర్పాటు చేయడం అందరి ఆకాంక్ష అన్నారు. లోక్‌సభ కమిటీ సూచనలు, సిఫారసుల మేరకు విగ్రహం సిద్ధంగా ఉందని తెలిపారు. పార్లమెంట్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఇప్పటికే సిద్ధంగా ఉన్న విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని