‘‘ఏపీలో ఇంటి స్థలాల పేరుతో భారీ అవినీతి’’

తాజా వార్తలు

Updated : 07/07/2020 13:19 IST

‘‘ఏపీలో ఇంటి స్థలాల పేరుతో భారీ అవినీతి’’

తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు

గుంటూరు: వైకాపా నేతల వాటాల్లో తేడాలు రావడం వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా పడ్డాయని తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. పేదల ఇళ్ల స్థలాల్లో అవినీతి జరిగిందంటూ గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో ఆయన నిరసన దీక్షప్రారంభించారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ ‘‘ఇళ్ల స్థలాల పంపిణీని తెదేపా అడ్డుకుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇంటి స్థలాల పేరుతో భారీ కుంభకోణం జరిగింది. దానిపై విచారణ జరపాలి’’అని డిమాండ్‌ చేశారు. ఈ నెల 8న ఇల్లు లేని ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఆగస్టు 15న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని