‘‘కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు’’

తాజా వార్తలు

Published : 08/07/2020 00:38 IST

‘‘కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు’’

భాజపా టీఎస్‌ అధ్యక్షుడు బండి సంజయ్‌

హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయి గవర్నర్ తమిళిసైను సంప్రదిస్తున్నారు అని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలతో భాజపా జనసంవాద్‌ వర్చువల్‌ సభను నిర్వహించింది. ఇందులో బండి సంజయ్‌తోపాటు ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు.  ప్రభుత్వ తీరుపై గవర్నర్ అసంతృప్తిగా ఉన్నారని సంజయ్‌ చెప్పారు. కరోనా కట్టడిపై ప్రభుత్వ అధికారులతో గవర్నర్ మాట్లాడే ప్రయత్నం చేస్తే అధికారులు భయపడుతున్నారని సంజయ్‌ అన్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని సంజయ్‌ విమర్శించారు. 

‘‘ఇంటర్ విద్యార్థులు చనిపొతే సీఎం స్పందించలేదు. కొండగట్టు సంఘటన జరిగినపుడు ముఖ్యమంత్రి చూడటానికి కూడా వెళ్లలేదు’’ అని సంజయ్‌ అన్నారు.  రైతులు మరణాలపై ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందని దుయ్యబట్టారు.  నిజామాబాద్‌ను తెరాస, ఎంఐఎంకు అడ్డాగా భావించారు. కానీ ఇప్పుడు ఇది కాషాయ జెండాకు నిర్వచనంగా మారిందన్నారు. నిజామాబాద్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని బండి సంజయ్‌ చెప్పారు.  

‘‘ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలి. ఆదిలాబాద్‌ సింగరేణిలో జరిగిన రూ. 400 కోట్ల డీజిల్‌ కుంభకోణంపై చర్యలు తీసుకోవాలి. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కల్తీ విత్తనాల తయారీపై చర్యలు చేపట్టాలి’’ అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని