గౌరెల్లి ప్రజలను ఆదుకోండి: చాడ

తాజా వార్తలు

Published : 11/07/2020 12:49 IST

గౌరెల్లి ప్రజలను ఆదుకోండి: చాడ

హైదరాబాద్‌: దాదాపు 12 ఏళ్లు గడుస్తున్నా గౌరెల్లి రిజర్వాయర్‌ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శ్రీరాంసాగర్‌ వరద కాల్వలో భాగంగా గౌరెల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ తక్షణమే స్పందించి.. సర్వం కోల్పోతున్న గౌరెల్లి ప్రజలను ఆదుకోవాలని కోరారు. కుర్చీ వేసుకొని మరీ పనులు చేయిస్తాన్న కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించారు.భూములు కోల్పోయిన రైతులకు పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌, నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌రావుకు లేఖ రాస్తానన్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని