ఎక్కువ అప్పు చేశామన్నది వాస్తవమే: బుగ్గన

తాజా వార్తలు

Published : 15/07/2020 02:24 IST

ఎక్కువ అప్పు చేశామన్నది వాస్తవమే: బుగ్గన

అమరావతి: తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు వారానికోసారి ఆర్థికాంశాలపై ఏదేదో మాట్లాడుతున్నారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. రాష్ట్రంలో వృద్ధిరేటు ఎక్కడ తగ్గిందో యనమల చెప్పగలరా?అని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఎక్కడా వెనుకబడిన దాఖలాలు లేవన్నారు.దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ద్రవ్యోల్బణం తక్కువ నమోదైట్లు చెప్పారు. ‘‘ వాస్తవాలు లేకుండా యనమల నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గతంలోని రూ.15వేల కోట్ల బకాయిల చెల్లింపు వల్ల రెవెన్యూలోటు పెరిగింది. బహిరంగ మార్కెట్లో ఎక్కువ అప్పు చేశామనేది వాస్తవమే. కేంద్ర, రాష్ట్ర పన్నులు కలిపి వస్తున్న ఆదాయం రూ.లక్షా 14వేల కోట్లు. గత ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన అప్పులభారం మోపింది. ఈసారి బడ్జెట్‌లో అన్ని శాఖలకూ కేటాయింపులు పెరిగాయి. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.42,603 కోట్లు ఇచ్చాం. రెవెన్యూలోటు, పోలవరానికి, జీఎస్టీ బకాయిలు ఇవ్వాలని, రామాయపట్నం, కడప ఉక్కుపరిశ్రమకు నిధులివ్వాలని కేంద్రాన్ని కోరాం’’అని మంత్రి బుగ్గన అన్నారు. విదేశీ ఆర్థిక సంస్థ రుణం, గ్రాంట్‌ ఇచ్చేందుకు ఒప్పుకుందని వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని