TS News: హుజూరాబాద్‌ నుంచే మరో ఉద్యమానికి నాంది: ఈటల

తాజా వార్తలు

Updated : 08/06/2021 13:52 IST

TS News: హుజూరాబాద్‌ నుంచే మరో ఉద్యమానికి నాంది: ఈటల

కమలాపూర్: తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ కేంద్రబిందువని.. ఎత్తిన జెండా, బిగించిన పిడికిలితో ముందుకు సాగుతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆనాడు సింహగర్జనకు కరీంనగర్‌ ఎలా తొలిపలుకు పలికిందో.. నేడు హుజూరాబాద్‌ కూడా ఆత్మగౌరవ పోరాటానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమక్షేత్రంగా మారనుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధిచెబుతామని హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు చెప్పారని.. ఎన్నికల్లో తన విజయానికి భరోసా ఇచ్చారని తెలిపారు. తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తొలిసారిగా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. కమలాపూర్‌ మండలంలో అభిమానులు, కార్యకర్తలతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ధర్మానికి, అధర్మానికి మధ్య సంగ్రామం జరగనుందన్నారు. కొంతమంది వ్యక్తులు తొత్తులుగా మారి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధి చెబుతామన్నారు. హుజూరాబాద్‌ నుంచే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని ఈటల చెప్పారు. నియోజకవర్గంలో ధర్మానిదే విజయమని.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తామన్నారు. అక్రమ సంపాదనతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని