TS News: భాజపాలో చేరిన ఈటల 
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 15:29 IST

TS News: భాజపాలో చేరిన ఈటల 

దిల్లీ: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భాజపాలో చేరారు. దిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి, పలువురు ఉస్మానియా ఐకాస నేతలు భాజపాలో చేరారు. ఈటలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన్‌ అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈటల కీలక పాత్ర పోషించారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన సేవలందించారన్నారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తాము సత్తా చాటబోతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఈటల వంటి నేతల చేరికతో భాజపా బలపడుతోందన్నారు. ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అధినాయకత్వం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు. తెలంగాణ నలుచెరుగులా పార్టీని విస్తరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాబోయే కాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భాజపాలోకి చేరికలు ఉంటాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈటల కీలక పాత్ర పోషించారని బండి సంజయ్‌ చెప్పారు. నియంత పాలన నుంచి ఆయన బయటకు వచ్చారన్నారు. భాజపా రాష్ట్ర శాఖ తరఫున ఈటలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం భాజపాకే ఉందన్నారు. రాష్ట్రంలోని ఉద్యమకారులకు భాజపా వేదిక కానుందని.. ప్రజాస్వామ్య తెలంగాణ దిశగా పనిచేస్తామన్నారు. ఆ తర్వాత భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈటల రాజేందర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని