‘ఆమె.. ఓ సర్కారీ షట్లర్‌’: సైనా ట్వీట్‌పై విమర్శ

తాజా వార్తలు

Published : 05/07/2021 00:58 IST

‘ఆమె.. ఓ సర్కారీ షట్లర్‌’: సైనా ట్వీట్‌పై విమర్శ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా విజయంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అభినందిస్తూ ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ చేసిన ట్వీట్‌ విమర్శల పాలైంది. ‘సర్కారీ షట్లర్‌’ అంటూ ఆర్‌ఎల్డీ చీఫ్‌ జయంత్‌ చౌధరి ఆమెపై విమర్శలు చేశారు.

యూపీ జిల్లా పంచాయతీ ఛైర్‌పర్సన్ల ఎన్నికల్లో 75 స్థానాలకు గానూ భాజపా 67 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో శనివారం రాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సైనా ట్వీట్‌ చేసింది. దీనిపై జయంత్‌ చౌధరి స్పందిస్తూ.. ప్రజా తీర్పును తొక్కి పెట్టిన భాజపా నైపుణ్యాన్ని సర్కారీ షట్లర్‌ గుర్తించారంటూ వ్యంగ్యంగా ట్వీట్‌చేశారు. తమ వ్యక్తిగత అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేసే ప్రముఖుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. పలువురు నెటిజన్లు కూడా ఆమెపై విమర్శలు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని