AP News : కొనసాగుతున్న తెదేపా నేతల గృహనిర్బంధం 

తాజా వార్తలు

Updated : 31/07/2021 13:14 IST

AP News : కొనసాగుతున్న తెదేపా నేతల గృహనిర్బంధం 

అమరావతి : కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన చేయనుంది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యుల గృహ నిర్బంధం కొనసాగుతోంది. కమిటీ సభ్యులైన తంగిరాల సౌమ్య,  నాగుల్ మీరాలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గుంటూరులో నక్కా ఆనంద్ బాబు, విజయవాడలో వర్ల రామయ్య, బోండా ఉమా, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర , కొనకళ్ల నారయణ, జగ్గయ్యపేటలో నెట్టెం రఘురాంలను నిన్ననే ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లే తమను ఎలా అడ్డుకుంటారని నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్రలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నేతలు తీవ్రంగా ఖండించారు.

మరోవైపు గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెదేపా నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. మంగళగిరి తెదేపా ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీగా  మోహరించారు. ప్రకాశం బ్యారేజ్‌, కనకదుర్గమ్మ వారధి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని