vijaya sai reddy: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కానివ్వబోం: విజయసాయి

తాజా వార్తలు

Updated : 02/08/2021 14:51 IST

vijaya sai reddy: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కానివ్వబోం: విజయసాయి

న్యూదిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం దేశ రాజధానిలో విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు మహా నిరసన కార్యక్రమం చేపట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నో పోరాటాలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వచ్చింది. దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది. 1991లో ఉత్పత్తి మొదలు పెట్టారు. ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా అవతరించింది. 15వేల మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, 17వేల మంది కాంట్రాక్‌ ఉద్యోగులు 70వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రైవేటీకరించేందుకు మనం ఒప్పుకోకూడదు. రాజకీయాలకు అతీతంగా, మన గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు మనమంతా పోరాటం చేయాలి. ఈ విషయంలో మీతో పాటు మేమూ కలిసి నడుస్తాం. పోరాటం సాగిస్తాం. కొవిడ్‌ క్లిష్ట పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఇప్పటికీ నెలకు రూ.200 కోట్ల లాభంతో ఉక్కు కర్మాగారం నడుస్తోంది. నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరణ చేయటం భాజపా ప్రభుత్వం విధివిధానాల్లో ఒకటి. కానీ, విశాఖ ఉక్కు లాభాల్లో నడుస్తోంది. మధ్యలో కొన్ని సంవత్సరాలు నష్టాలు వచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన సంస్థను ప్రైవేటీకరించడం తగదు’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని