బ్లూటిక్‌ ఫైట్‌లో మోదీ ప్రభుత్వం బిజీ: రాహుల్‌
close

తాజా వార్తలు

Published : 07/06/2021 01:08 IST

బ్లూటిక్‌ ఫైట్‌లో మోదీ ప్రభుత్వం బిజీ: రాహుల్‌

దిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ల గురించి పట్టించుకోకుండా ట్విటర్‌ బ్లూటిక్‌ కోసం ప్రభుత్వం పోరాడుతోందంటూ ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఆయన హిందీలో ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘‘మోదీ ప్రభుత్వం బ్లూటిక్‌ కోసం పోరాటం చేస్తోంది. ఒకవేళ మీకు వ్యాక్సిన్‌ కావాలంటే ఆ సంగతి మీరే చూసుకోండి’’ అని రాహుల్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. బ్లూటిక్‌ కంటే వ్యాక్సిన్లు ముఖ్యం అనే అర్థం వచ్చేలా #Priorities అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఉపరాష్ట్రపతి సహా ఆరెస్సెస్‌ చీఫ్‌ వ్యక్తిగత ఖాతాలకు ట్విటర్‌ బ్లూటిక్‌ తొలగించడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తంచేసిన నేపథ్యంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

దిల్లీలోని గోవింద్‌ భల్లభ్‌ పంత్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు ఇంగ్లీష్‌, హిందీ మాత్రమే మాట్లాడాలని, మలయాళం మాట్లాడకూడదంటూ ఆసుపత్రి యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది. విమర్శలు రావడంతో ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది. దీనిపైనా రాహుల్‌ స్పందించారు. మలయాళం కూడా భారతీయ భాషేనని, భాషా వివక్షను ఆపాలని సూచించారు. ఈ ఉత్తర్వులు దేశ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని ప్రియాంక వాద్రా పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజారోగ్యం కంటే సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టే ముఖ్యమని ఎద్దేవాచేశారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి జనవరి మధ్య ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌ పడకలను తగ్గించారని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని