ఎస్ఈసీ కాన్ఫరెన్స్‌కు ఉన్నతాధికారుల గైర్హాజరు

తాజా వార్తలు

Updated : 23/01/2021 16:59 IST

ఎస్ఈసీ కాన్ఫరెన్స్‌కు ఉన్నతాధికారుల గైర్హాజరు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణపై ముందస్తుగా సమాచారం అందించిన ఎస్‌ఈసీ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)‌, డీజీపీ, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని ఆదేశించారు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ప్రారంభమైన కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, కొంత మంది జిల్లా స్థాయి అధికారులు మాత్రమే పాల్గొన్నారు. సీఎస్‌, డీజీపీ, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, కొన్ని జిల్లాల అధికారులు గైర్హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం 5గంటల వరకు వేచి చూస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్‌ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌ ఎస్‌ఈసీని కోరారు. అభ్యర్థనను తిరస్కరించిన ఎస్‌ఈసీ సీఎస్‌కు లేఖ రాశారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయిందని.. వ్యాక్సినేషన్‌, ఎన్నికలపై చర్చకు వీడియో కాన్ఫరెన్స్‌ సరైన వేదిక అని ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నారు. అందరి సహకారంతోనే ఎన్నికలు పూర్తి చేయగలుగుతామని లేఖలో తెలిపారు.

మరోవైపు గైర్హాజరైన అధికారులపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోనుందనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికారుల సహాయ నిరాకరణను ఎస్‌ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అధికారుల సహాయ నిరాకరణతో ఎన్నికల సంఘం తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.

ఇవీ చదవండి..

మీ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని