యువతను ప్రభుత్వం శిక్షిస్తోంది: రాహుల్‌

తాజా వార్తలు

Published : 17/03/2021 18:02 IST

యువతను ప్రభుత్వం శిక్షిస్తోంది: రాహుల్‌

దిల్లీ: దేశంలో విద్యావంతులైన యువత తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. అంతేకాకుండా.. దేశంలోని పలు ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల అంశాన్ని ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌లో ప్రస్తావించారు.

‘దేశంలో విద్యావంతులైన యువత తీవ్ర నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే ఉన్నత చదవులు అభ్యసించినందుకు ప్రభుత్వం వారిని శిక్షిస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రత్యేకంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయం’ అని రాహుల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో పాటు రాహుల్‌ దేశంలోని పలు ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు సంబంధించిన డేటాను జతచేశారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం సహా పలు సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం ఉన్న ఖాళీల శాతాన్ని పోస్టులో వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని