ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం
close

తాజా వార్తలు

Updated : 09/04/2021 20:06 IST

ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం

విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) తీర్మానం చేసింది. కార్పొరేషన్‌ ఎన్నికల తర్వాత మేయర్‌ గొలగాని వెంకట హరికుమారి అధ్యక్షతన జరిగిన మొదటి సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయసాయిరెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన మిగతా ఎంపీలు రాజీనామా చేయాలని తెదేపా, జనసేన కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. కేంద్రంపై వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తూనే ఉన్నామని వైకాపా ఎంపీ సత్యనారాయణ చెప్పారు. 

అంతకుముందు తెదేపా కార్పొరేటర్‌ కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ, అనకాపల్లి ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజీనామా అస్త్రాన్ని దిల్లీలో ప్రయోగిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాదన్నారు. ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసినంత మాత్రాన సీఎం జగన్‌కు ఏం నష్టమూ జరగదన్నారు. రాజీనామా చేసిన ఎంపీలను విశాఖ ప్రజలు తమ హృదయాల్లో చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటారన్నారు. విశాఖలోని స్టీల్‌ ప్లాంట్‌, పోర్టు ప్రైవేటీకరణ జరిగితే నగరం నామరూపాల్లేకుండా పోతుందని సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు హెచ్చరించారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల సమయంలో జీవీఎంసీకి చెందిన అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దిల్లీ వెళ్లి అక్కడే నిరసన తెలపాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని