ఈటల నుంచి వైద్యారోగ్య శాఖ సీఎంకు బదిలీ

తాజా వార్తలు

Updated : 01/05/2021 14:32 IST

ఈటల నుంచి వైద్యారోగ్య శాఖ సీఎంకు బదిలీ

హైదరాబాద్: తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ నుంచి వైద్యారోగ్య శాఖ సీఎం కేసీఆర్‌కు బదిలీ అయింది. ఈ మేరకు సీఎం సిఫార్సుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం కొంత మంది అసైన్డ్‌దారులు సీఎం కేసీఆర్‌కు ఈటల, మరికొందరిపై ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుతో సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు.

ఈటలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి మెదక్‌ జిల్లా అచ్చంపేటలో ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు ఈ ఉదయం విచారణ ప్రారంభించారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ విజిలెన్స్ విచారణను పరిశీలించారు. కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్‌ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని.. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తామని కలెక్టర్‌ వెల్లడించారు. ఓవైపు విచారణ జరుగుతుండగానే ఈటల నుంచి వైద్యారోగ్య శాఖను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని