మెట్‌పల్లిలో భారీగా మోహరించిన పోలీసులు
close

తాజా వార్తలు

Updated : 23/01/2021 01:38 IST

మెట్‌పల్లిలో భారీగా మోహరించిన పోలీసులు

కోరుట్ల (జగిత్యాల) : అయోధ్యలో రామమందిర నిధి సేకరణపై కోరుట్ల తెరాస ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌ ‌రావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మెట్‌పల్లిలోని ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి భాజపా పిలుపునిచ్చింది. దీంతో ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు మెట్‌పల్లికి చేరుకొని ఎమ్మెల్యే ఇంటి ముందు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. 
మరోవైపు నియోజకవర్గంలోని మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఇవాళ మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఆయా మండలాల్లో పలు అభివృద్ధి పనుల్లో మంత్రులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా భారీ భద్రత నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి..
అయోధ్య రాముడు మనకెందుకు?

అంతుచిక్కని కారణాలతో పలువురికి అస్వస్థత
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని