Assam:సీఎం అభ్యర్థిని ఖరారు చేసిన భాజపా
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 00:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Assam:సీఎం అభ్యర్థిని ఖరారు చేసిన భాజపా

గువహటి: అస్సాం సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై  ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మను భాజపా అధిష్ఠానం సీఎం అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇప్పటికే గువహటిలో అస్సాం భాజపా శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా హిమంతను ఎన్నుకోనున్నారు. త్వరలో సీఎంగా ఆయన  ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

సీఎం అభ్యర్థి ఎంపికపై భాజపా అధిష్ఠానం పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. ప్రస్తుత సీఎం శర్బానంద సోనోవాల్‌, హిమంత బిశ్వశర్మ పట్టుబట్టడంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కనుందనేదానిపై ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు శనివారం దిల్లీ చేరుకుని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పలు దఫాలుగా చర్చించారు. తొలుత విడివిడిగా.. ఆ తర్వాత కలిసి హాజరయ్యారు. ఈ విషయంలో రాజీ పడేందుకు హిమంత ససేమిరా అన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హిమంతను సీఎం అభ్యర్థిగా  ఖరారు చేస్తూ భాజపా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు సీఎం పదవికి శర్బానంద సోనోవాల్‌ రాజీనామా చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని