‘మీ ప్రేమకు బానిసను.. క్రియాశీల రాజకీయాల్లో ఉంటా’ 
close

తాజా వార్తలు

Updated : 09/02/2021 12:29 IST

‘మీ ప్రేమకు బానిసను.. క్రియాశీల రాజకీయాల్లో ఉంటా’ 

మద్దతుదారులతో శశికళ

తిరుపతూరు: తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల కారాగార వాసం ముగిశాక తొలిసారి ఆమె తమిళనాడులో అడుగుపెట్టారు. క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టంచేశారు. సోమవారం బెంగళూరు నుంచి చెన్నైకి బయల్దేరిన ఆమె మార్గమధ్యంలో మద్దతుదారులతో సమావేశమయ్యారు. వారితో కాసేపు మాట్లాడారు. తమిళనాడు ప్రజలకు తానెంతగానో రుణపడి ఉన్నానని, అణిచివేతలకు భయపడేదిలేదన్నారు. కార్యకర్తల ప్రేమకు బానిసనని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారా? అని అడ్గగా.. ప్లీజ్‌.. వెయిట్‌ అండ్‌ సీ అని సమాధానం ఇచ్చారు.  పార్టీ కార్యకర్తల కోసం క్రియాశీల రాజకీయాల్లో ఉంటానన్నారు. 

200 కార్లతో కాన్వాయ్‌..
మరోవైపు, చెన్నైకి చేరుకున్న అనంతరం శశికళ రామాపురంలోని ఎంజీఆర్‌ నివాసానికి వెళ్లనున్నారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించిన  అనంతరం టీనగర్‌లోని తన ఇంటికి చేరుకోనున్నారు. జైలు నుంచి విడుదల తర్వాత తొలిసారి తమిళనాడుకు వస్తున్న శశికళకు మద్దతుదారులు దారిపొడవునా స్వాగతం పలికారు. 200 కార్లతో శశికళ కాన్వాయ్‌ను మద్దతుదారులు అనుసరించారు. ఆమె కారుపై అన్నాడీఎంకే పార్టీ జెండాను ఉంచారు. పార్టీనుంచి బహిష్కరించినా కారుపై అన్నాడీఎంకే జెండా ఉండటం గమనార్హం.

ఇదీ చదవండి..

తమిళనాడుకు శశికళ..ఆసక్తిగా రాజకీయాలు

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని