ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శిగా కన్నబాబు
close

తాజా వార్తలు

Published : 30/01/2021 01:06 IST

ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శిగా కన్నబాబు

అమరావతి: ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి కె.కన్నబాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. 
పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కార్యదర్శి లేకపోవడం కమిషన్‌ పనితీరుపై ప్రభావం చూపుతోందని, కార్యదర్శి పోస్టును భర్తీ చేసేందుకు ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌ఈసీ ఇటీవల లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు రాజబాబు, విజయ్‌కుమార్‌, కన్నబాబు పేర్లను ప్రతిపాదించింది. వీటిని పరిశీంచిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. కన్నబాబును ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి..

నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారు: సజ్జల

కర్నూలు నుంచి ఇండిగో విమాన సర్వీసులుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని