మేం అధికారంలోకి వస్తే మహిళలకు 33% కోటా: షా 

తాజా వార్తలు

Updated : 18/02/2021 16:02 IST

మేం అధికారంలోకి వస్తే మహిళలకు 33% కోటా: షా 

బంగారు బెంగాలే లక్ష్యమన్న కేంద్ర హోంమంత్రి

దక్షిణ 24 పరగణాలు‌: పశ్చిమ బెంగాల్‌ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే భాజపా పోరాడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. మమతా బెనర్జీ సర్కార్‌ను ఓడించి భాజపాను అధికారంలోకి తేవడం తమ లక్ష్యం కాదని, ఇక్కడి పరిస్థితుల్లో మార్పు తేవడమే లక్ష్యమన్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నవేళ రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగాల్‌కు వచ్చిన అమిత్‌ షా.. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కాక్‌ద్విప్‌లో గురువారం ఐదో విడత పరివర్తన్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

బెంగాల్‌ ఎన్నికల్లో పోరాటం తమ పార్టీ బూత్‌ కార్యకర్తలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ సిండికేట్ల మధ్యేనన్నారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక ఏటా లక్షలాది మంది యాత్రికులు వచ్చే గంగాసాగర్‌ మేళాను అంతర్జాతీయ టూరిస్ట్‌ సర్క్యూట్‌గా మారుస్తామన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల పర్యాటక ప్రాజెక్టులను ఇక్కడ విజయవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

భాజపా చేపట్టిన పరివర్తన్‌ యాత్రలు 294 నియోజకవర్గాలను కలుపుతూ కొనసాగుతున్నాయని తెలిపారు. బెంగాల్‌లో రాజకీయ హింసకు 130 మంది భాజపా కార్యకర్తలు మృతిచెందారన్నారు.తమ పార్టీ అధికారంలోకి రాగానే అంపన్‌ తుపాను నిధుల పంపిణీలో అవినీతిపైనా దర్యాప్తు చేస్తామన్నారు. అలాగే, తుపానులు, పర్యావరణ విపత్తుల నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

భాజపా గూటికి మరో నటుడు

మరోవైపు, ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడిన సినీనటుడు హిరన్‌ ఛటర్జీ భాజపాలో చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన అమిత్‌ షా, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో చేరారు. యశ్‌దాస్‌గుప్తా చేరిన మరుసటి రోజే హిరన్‌ చేరడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని