అధికారంలోకి వస్తే సీఏఏను అమలుచేయబోం: స్టాలిన్‌

తాజా వార్తలు

Published : 30/03/2021 11:28 IST

అధికారంలోకి వస్తే సీఏఏను అమలుచేయబోం: స్టాలిన్‌

చెన్నై: తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలుచేయబోమని డీఎంకే అధినేత స్టాలిన్‌ స్పష్టం చేశారు. సీఏఏపై పార్లమెంట్‌లో భాజపాకు మద్దతిచ్చిన అన్నాడీఎంకేపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అన్నాడీఎంకే, పీఎంకే సభ్యులు సీఏఏకు మద్దతుగా రాజ్యసభలో ఓటు వేసిన విషయాన్ని స్టాలిన్‌ గుర్తుచేశారు. జోలార్‌పేట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్టాలిన్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏపై అన్నాడీఎంకే నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. మైనారిటీలకు డీఎంకే ఎప్పుడూ మద్దతుగానే నిలుస్తుందన్న ఆయన తాము పార్లమెంట్‌లో ఈ బిల్లును వ్యతిరేకించామని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు రూ.వెయ్యి ఇస్తామని.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని స్టాలిన్‌ హామీ ఇచ్చారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని