‘జన్‌ కీ బాత్‌’పై మాట్లాడాలి: రాహుల్‌ గాంధీ

తాజా వార్తలు

Published : 26/04/2021 01:16 IST

‘జన్‌ కీ బాత్‌’పై మాట్లాడాలి: రాహుల్‌ గాంధీ

దిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌లో మాట్లాడిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ స్పందించారు. ‘యంత్రాంగం విఫలమైంది. జన్‌ కీ బాత్‌ గురించి మాట్లాడాల్సిన సమయమిది’ అని ట్వీట్‌ చేశారు. ఈ సంక్షోభ సమయంలో దేశానికి బాధ్యతాయుతమైన పౌరులు అవసరమన్న రాహుల్‌.. రాజకీయ పనులను పక్కనపెట్టి అవసరాల్లో ఉన్న దేశ ప్రజలకు సాయమందించాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. ఇది కాంగ్రెస్‌ ధర్మమని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడారు. తొలి దశ కరోనా విబృంభణను సమర్థంగా ఎదుర్కొన్న భారత్‌ ఆత్మవిశ్వాసంతో మందుకు సాగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా వచ్చిన రెండోదశ దేశాన్ని అతలాకుతలం చేస్తోందని ఆవేదన చెందారు. ఈ విపత్కర సమయంలో రాష్ట్రాలకు కావాల్సిన అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అర్హులందరికీ ఉచితంగా టీకా అందజేస్తామని హామీ ఇచ్చారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్న వైద్యారోగ్య సిబ్బందిని మోదీ ఈ సందర్భంగా అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని