close

తాజా వార్తలు

Published : 22/04/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్రానికో ధర.. రాష్ట్రానికో ధరా..?

దిల్లీ: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేసే కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ సరఫరా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలు నిర్ణయించడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తప్పుబట్టారు. కేంద్రం ఒక డోసును రూ.150కే కొనుగోలు చేసి... రాష్ట్రాలకు మాత్రం రూ.400 విక్రయించడమేంటని ప్రశ్నించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

‘‘కొవిషీల్డ్‌ ఒక డోసుకు కేంద్రం రూ.150 చెల్లిస్తోంది. అదే రాష్ట్ర ప్రభుత్వాలు రూ.400 చెల్లించాలట. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాలకు ఇది మరింత భారం అవుతుంది. ఇది చాలా దారుణం’’ అని జైరాం రమేశ్‌ ట్వీట్‌ చేశారు. ఒకే దేశం.. ఒకే ధర ఉండాలని డిమాండ్‌ చేశారు.

50 శాతం వ్యాక్సిన్లను రాష్ట్రాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు నేరుగా విక్రయించుకోవచ్చని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థ వ్యాక్సిన్‌ ధరలను ప్రకటించింది. ఒక్కో డోసుకు ప్రైవేటు ఆస్పత్రులకైతే రూ.600, రాష్ట్ర ప్రభుత్వాలకైతే రూ.400 చొప్పున చెల్లించాలని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వేర్వేరు ధరలపై జైరాం రమేశ్‌ ఈ విధంగా స్పందించారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కేంద్రమే వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని, అందుకోసం పీఎం-కేర్స్‌ నిధులను వినియోగించాలని సూచించారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని