అది నియంతృత్వ పోకడే: నాదెండ్ల మనోహర్‌ 

తాజా వార్తలు

Updated : 20/07/2021 09:32 IST

అది నియంతృత్వ పోకడే: నాదెండ్ల మనోహర్‌ 

అమరావతి: ఏపీలోని నిరుద్యోగ యువతకు జనసేన బాసటగా నిలిస్తే గృహనిర్బంధాలు చేస్తారా?అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా నయవంచనకు పాల్పడిందని ఆరోపించారు. మోసపోయిన బాధితులకు జనసేన బాసటగా నిలిస్తే సీఎం ఇబ్బంది పడుతున్నారని మనోహర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం ఆయా జిల్లాల ఉపాధి అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని జనసేన చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న జనసేన నాయకులు, జన సైనికులను నిన్న రాత్రి నుంచి గృహ నిర్భంధాల్లో ఉంచడం అప్రజాస్వామికం అని మనోహర్‌ అన్నారు.

‘‘ప్రజాస్వామ్యంలో వినతిపత్రాలు ఇవ్వడం పౌరులకు, వారి పక్షాన నిలిచేవారికి ఉన్న హక్కు. దీన్ని అడ్డుకోవడం కచ్చితంగా నియంతృత్వ పోకడే అవుతుంది. సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేసి అమలు చేయమంటే ఇబ్బంది కలుగుతోందా?ప్రభుత్వం ఎంతగా కట్టడి చేసినా జనసేన పార్టీ నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ అండగా నిలుస్తుంది’’ అని మనోహర్‌ అన్నారు. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని