ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను: జానారెడ్డి
close

తాజా వార్తలు

Published : 02/05/2021 19:20 IST

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను: జానారెడ్డి

హైదరాబాద్‌: సాగర్‌ ఉపఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన తెరాస అభ్యర్థి నోముల భగత్‌కు ఆయన అభినందనలు తెలిపారు. గాంధీ భవన్‌లో జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం కృషి చేసి.. తనను ఆశీర్వదించిన ఓటరు మహాశయులు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రతినిధులకు జానారెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

‘‘కేవలం ఒక్క స్థానంలో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించాలని.. ప్రభుత్వాలను పడగొట్టాలని ఆలోచించి నేను పోటీలో నిలబడలేదు. ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకు ఈ ఎన్నికలు అవసరం అని నేను, పార్టీ భావించాం. ఈ విషయంలో నా కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు సాగర్‌ ఎన్నికలో పోటీ చేశాను. ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకే ఎన్నికల బరిలో నిలిచాను. పార్టీకి అండగా ఉండాలని.. గెలవాల్సిన అవసరం ఉందని అనేక రకాలుగా ఆలోచించిన తర్వాతే పోటీ చేశాను. ఇందుకోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.

ఎన్నికల నేపథ్యంలో తెరాస పార్టీ, కార్యకర్తలు, మంత్రులు అందరూ కలిసి కాంగ్రెస్‌ను నిలువరించాలని ప్రయత్నించారు. అయినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని ఈ ఎన్నికలో నిలబడి కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటిందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ ఎన్నికలో దాదాపు 47 శాతం ఓట్లు తెరాసకు వస్తే.. కాంగ్రెస్‌కు 37 శాతం ఓట్లు వచ్చాయి. తేడా కేవలం 10 శాతమే. తెరాస ప్రభుత్వం, పార్టీ అంతా కలిసి సర్వం ఒడ్డినా స్వల్ప తేడాతోనే విజయం సాధించింది. దీన్ని చూస్తే.. రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ ఏమీ కోల్పోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇదే ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలి’’ అని జానారెడ్డి తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని