హామీలివ్వడం తెరాసకు అలవాటైంది: జానారెడ్డి
close

తాజా వార్తలు

Published : 13/02/2021 01:55 IST

హామీలివ్వడం తెరాసకు అలవాటైంది: జానారెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా హామీల వర్షం కురిపించడం తెరాసకు పారిపాటిగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన తెరాస బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీపై సీఎం కేసీఆర్‌ చేసిన ఆరోపణలను జానారెడ్డి ఖండించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్‌ పార్టీపై సీఎం కేసీఆర్‌ అనవసర ఆరోపణలు చేశారని.. నెల్లికల్‌ ఎత్తిపోతలకు తానే అనుమతులు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెరాస పూర్తిగా విఫలమైందన్నారు. రుణ మాఫీ, మూడెకరాల భూపంపిణీ ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నందుకు అభినందిస్తున్నారని.. బంగారుతల్లి పథకాన్ని కల్యాణలక్ష్మిగా మార్చి అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీపైనే కేసీఆర్‌ ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రత్యేక రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందని గెలిపిస్తే.. ప్రజలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో తెరాస ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి..

బీఫార్మసీ విద్యార్థిని అత్యాచారంలో కొత్త కోణం

మీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు బాగున్నాయా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని