పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేయండి
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 13:31 IST

పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేయండి

హైకోర్టులో జనసేన హౌస్‌మోషన్‌ పిటిషన్‌

అమరావతి: పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ జనసేన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోలేదని, పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరింది.అంతేకాకుండా సుప్రీం కోర్టు తీర్పుకు ఎస్‌ఈసీ తీరు విరుద్ధమని జనసేన స్పష్టం చేసింది. ఈ మేరకు హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి.. మధ్యాహ్నం 2.15కు విచారణ చేపట్టనుంది.మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ భాజపా కూడా హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని