తెదేపా ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల రాజీనామా
close

తాజా వార్తలు

Updated : 02/04/2021 22:09 IST

తెదేపా ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల రాజీనామా

జగ్గంపేట: తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించారు. జగ్గంపేట తెదేపా ఇన్‌ఛార్జ్‌గా మాత్రం కొనసాగుతానని చెప్పారు. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ  ప్రకటించడం తనను నిరాశకు గురిచేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. 

జ్యోతుల నెహ్రూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో తెదేపా తరఫున విజయం సాధించిన ఆయన.. 2014లో వైకాపా నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత నెహ్రూ తెదేపాలో చేరారు. 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి జ్యోతుల చంటిబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని