Kanhaiya: కాంగ్రెస్‌లో కన్నయ్య మరో సిద్ధూలాగే..: ఆర్జేడీ

తాజా వార్తలు

Updated : 02/10/2021 10:54 IST

Kanhaiya: కాంగ్రెస్‌లో కన్నయ్య మరో సిద్ధూలాగే..: ఆర్జేడీ

ముజఫర్‌పూర్‌ (బిహార్‌): జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై బిహార్‌లోని ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్‌లో కన్నయ్య మరో సిద్ధూలాంటి వారని ఆర్జేడీ సీనియర్‌ నేత శివానంద్‌ తివారీ వ్యాఖ్యానించారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభానికి కారణమైన నవ్‌జ్యోత్ సింగ్‌ సిద్ధూతో కన్నయ్యను పోల్చిన ఆయన.. కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోతున్న ఓ నావలాంటిదని, దానికి భవిష్యత్తు లేదన్నారు. కన్నయ్య చేరికతో కాంగ్రెస్‌లో వచ్చే మార్పు ఏమీ ఉండబోదన్నారు. కాంగ్రెస్‌ పెద్ద నౌకలాంటిదని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల కన్నయ్య చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. కన్నయ్య వల్ల ఆ పార్టీకి మరింత నష్టం జరుగుతుందన్నారు. కన్నయ్య రాకతో కాంగ్రెస్‌లో పెద్దగా వచ్చే మార్పు ఉండదని, ఆయన పార్టీని కాపాడలేరన్నారు.

మరోవైపు, కన్నయ్య కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడంపై కనీసం ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్‌ను సంప్రదించలేదన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో ఉన్నట్టు సమాచారం. ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పాటై ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు బరిలో నిలిచిన విషయం తెలిసిందే.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని