యడియూరప్పకు కోర్టులో చుక్కెదురు..!

తాజా వార్తలు

Updated : 04/07/2021 12:14 IST

యడియూరప్పకు కోర్టులో చుక్కెదురు..!

బెంగళూరు: భూముల డీనోటిఫికేషన్‌ కేసుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూర్పకు కోర్టులో చుక్కెదురైంది. 15 ఏళ్ల నాటి భూకేటాయింపులకు సంబంధించిన కేసులో ఆయనపై దర్యాప్తును ముగించాలని కోరుతూ లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన 'బి-రిపోర్ట్'ను శనివారం బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో లోకాయుక్త డిప్యూటీ సూపరింటెండెంట్‌ స్థాయి అధికారితో దర్యాప్తును కొనసాగించడం సహా తుది నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో జాప్యంపై కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించింది. 

వర్తూర్-వైట్‌ఫీల్డ్ ఐటీ కారిడార్‌ పరిధిలోని బెల్లాండూర్, దేవర బీసనహళ్లిలోని విలువైన భూమి డీనోటిఫికేషన్‌కు సంబంధించి యడియూరప్ప అవకతవకలకు పాల్పడ్డారంటూ వాసుదేవరెడ్డి అనే వ్యక్తి లోకాయుక్త కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అప్పటి జేడీయస్‌-భాజపా సంకీర్ణ ప్రభుత్వంలో యడియూరప్ప ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. కోర్టు ఆదేశాలను అనుసరించి 2015 ఫిబ్రవరి 21న అవినీతి నిరోధక చట్టం కింద లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తును ముగించాలని కోరుతూ 2020 డిసెంబరులో యడియూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ కోర్టు పిటిషన్లను తిరస్కరించడంతో పాటు దర్యాప్తును ముమ్మరం చేయాలని ఆదేశించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని