Basavaraj Bommai: వరాలు కురిపించిన బొమ్మై

తాజా వార్తలు

Published : 29/07/2021 01:49 IST

Basavaraj Bommai: వరాలు కురిపించిన బొమ్మై

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే బసవరాజ్‌ బొమ్మై రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రైతు కుటుంబాల పిల్లలకు రూ.1000కోట్లతో ఉపకారవేతనాలు చెల్లించనున్నట్టు ప్రకటించారు. అలాగే, పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు వృద్ధాప్య పింఛన్‌ను రూ.1000 నుంచి రూ.1200లకు పెంచడంతో పాటు వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను రూ.600 నుంచి రూ.800లకు పెంచుతున్నట్టు బొమ్మై తెలిపారు. కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై ఈ రోజు ఉదయం 11గంటలకు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. 

ప్రధానికి థాంక్స్‌ చెబుతూ ట్వీట్‌!

కర్ణాటక కొత్త కొత్త సీఎంగా బొమ్మై ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. తనపై విశ్వాసం ఉంచిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో సుపరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా అందిస్తానని హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దాలన్న మోదీ విజన్‌ను కర్ణాటకలో సాకారం చేసేందుకు తన వంతు కృషిచేస్తానని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని