బంగారు తెలంగాణగా మార్చేదాక విశ్రమించను

తాజా వార్తలు

Updated : 02/06/2021 12:12 IST

బంగారు తెలంగాణగా మార్చేదాక విశ్రమించను

ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

హైదరాబాద్‌: ప్రజలు ఇచ్చిన భరోసాతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే వరకు విశ్రమించనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాలు, బలిదానాలతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేసుకున్నారు. ‘‘దేశం గర్వించదగ్గ రీతిలో రాష్ట్రాన్ని నిలబెట్టుకున్నాం. నాటి ఉద్యమ నినాదాలను రాష్ట్రం ఒక్కక్కటిగా అమలుచేస్తోంది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు అమలుచేస్తున్నాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని