సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

తాజా వార్తలు

Published : 17/01/2021 01:39 IST

సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంఎంటీఎస్‌ విస్తరణ పనులకు నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ రాశారు.

ఎంఎంటీఎస్‌ విస్తరణ పనుల కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.789 కోట్లు ఖర్చు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన రూ.414 కోట్లు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని కిషన్‌రెడ్డి వివరించారు. పనులు చేయడం ఆలస్యమైతే ప్రాజెక్టుపై భారం పడుతుందని లేఖలో వివరించారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ వెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టాలని, ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..
అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని