ఆ మార్పును గ్రహించలేకపోయాం: కిషన్‌రెడ్డి

తాజా వార్తలు

Published : 18/01/2021 01:17 IST

ఆ మార్పును గ్రహించలేకపోయాం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: మజ్లిస్‌‌ పార్టీతో స్నేహం లేకపోయుంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో కూడా తెరాస గెలిచేది కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు చేసుకున్న చీకటి ఒప్పందం కారణంగానే తెరాస 50కి పైగా స్థానాల్లో గెలవగలిగిందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన భాజపా కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయన్నారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ రాష్ట్రంలో దుబ్బాక తరహా పోటీ నెలకొందని.. 17 స్థానాల్లో పోటీ చేస్తే తెరాస కేవలం 9 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగిందన్నారు. అయితే ఆ విషయాన్ని రాజకీయ పార్టీగా ఆనాడు గ్రహించలేకపోయామన్నారు. తెరాస అధికార దుర్వినియోగం కారణంగా హైదరాబాద్‌లో భాజపా మేయర్‌ పీఠం దక్కించుకోలేక పోయిందని ఆరోపించారు. మరో 15 రోజుల తర్వాత న్యాయబద్ధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించి ఉంటే మేయర్‌ పీఠం భాజపా కైవసం చేసుకునేదన్నారు. రాబోయే రోజుల్లో తెరాసను ఎవరూ రక్షించలేరని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

రానున్న రెండేళ్లు భాజపాకు ఎంతో కీలకమైందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని.. ఆ మార్పు భాజపాతో మొదలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భాజపా నేతలు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పూర్తిస్థాయిలో రాజకీయ పోరాటాలు, ప్రజా పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఈ ప్రక్రియలో భాజపాను అడ్డుకునేందుకు అధికార తెరాస తన ప్రయత్నం చేస్తుందని.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పశ్చిమ్‌బెంగాల్‌లో భాజపా కార్యకర్తల పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసను ఓడించే విధంగా ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని జిల్లాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించే దిశగా పోరాటాలు సాగించాలన్నారు. రెండు స్థానాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా గెలుపునకు కృషిచేయాలని శ్రేణులకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి..

గోల్కొండపై భాజపా జెండా ఎగరేస్తాం: బండి

రైతుల ఆదాయం రెట్టింపు కోసమే..సాగు చట్టాలు!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని