అది నాకెలా ఎదురుదెబ్బ: కొడాలి నాని

తాజా వార్తలు

Published : 15/02/2021 01:08 IST

అది నాకెలా ఎదురుదెబ్బ: కొడాలి నాని

గుడివాడ: పంచాయతీ ఎన్నికల్లో తనకు సంబంధం లేని నియోజకవర్గంలోని ఒక గ్రామంలో వైకాపా మద్దతుదారు ఓడిపోతే కొన్ని మీడియాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా కార్యాలయంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో సమావేశమై వారిని అభినందించారు. అనంతరం అక్కడ ఆయన మాట్లాడుతూ.. పామర్రు నియోజకవర్గంలోని యలమర్రు గ్రామంలో వైకాపా మద్దతుదారు ఓడిపోతే, అది తనకు ఎదురుదెబ్బ ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు. తాను, తన తండ్రి గుడివాడ‌లోనే పుట్టామని.. తన సొంత ఊరు గుడివాడేనని స్పష్టం చేశారు. యలమర్రు గ్రామంలో తెదేపా మద్దతుదారులు ఎవరో, వైకాపా మద్దతుదారులు ఎవరో తనకు తెలియదన్నారు. యలమర్రు గ్రామంలో తాను ఎవరినైనా ఓటు అడిగానని నిరూపిస్తే రాజకీయాలు వదిలి రాష్ట్రం నుంచి వెళ్లిపోతానని కొడాలి నాని సవాల్‌ విసిరారు. గుడివాడ నియోజకవర్గంలో 58 పంచాయతీలకు గానూ 43 పంచాయతీలు వైకాపానే కైవసం చేసుకుందన్నారు.

ఇవీ చదవండి..

‘ఈ ఎన్నికలు వైకాపా పతనానికి నాంది’

ఎస్‌ఈసీ ఆదేశాలపై కొడాలి హౌస్‌మోషన్‌ పిటిషన్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని